రకుల్‌.. హైదరాబాద్‌ వచ్చేసింది

ABN , First Publish Date - 2020-09-29T01:45:25+05:30 IST

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి తర్వాత నెపోటిజం అంటూ బాలీవుడ్‌లో పెద్ద యుద్ధమే జరిగింది. సుశాంత్‌ ప్రియురాలు రియాని పోలీసులు

రకుల్‌.. హైదరాబాద్‌ వచ్చేసింది

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి తర్వాత నెపోటిజం అంటూ బాలీవుడ్‌లో పెద్ద యుద్ధమే జరిగింది. సుశాంత్‌ ప్రియురాలు రియాని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపితే.. నెపోటిజం కాస్తా.. డ్రగ్స్ కోణంలోకి మారి.. బాలీవుడ్‌ హీటెక్కి పోయే రేంజ్‌ వాస్తవాలు బయటికి వచ్చాయి. బాలీవుడ్డే కాకుండా ఈ కోణంలో కన్నడలో కూడా కొందరు హీరోయిన్‌లు అరెస్ట్ అయ్యారు. ఇక టాలీవుడ్‌కి వస్తే.. రకుల్‌ పేరును రియా ఈ లిస్ట్‌లోకి చేర్చిన విషయం తెలిసిందే. అయితే తన పేరు బయటికి రాగానే ఎక్కడ మీడియా ఇబ్బంది పెడుతుందో అని వెంటనే మీడియాపై కోర్టుకు వెళ్లింది రకుల్‌. 


అయినా మీడియాలో మాత్రం రకుల్‌ హైలెట్‌ అవుతూనే ఉంది. ఇక ఈ డ్రగ్స్ కోణంలో ముంబైలోని ఎన్సీబీ అధికారుల విచారణలో పాల్గొన్న రకుల్‌.. తను తాజాగా చేస్తున్న చిత్ర షూటింగ్‌ నిమిత్తమై మళ్లీ హైదరాబాద్‌లో అడుగెట్టింది. ఆమె హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2020-09-29T01:45:25+05:30 IST