రకుల్‌ప్రీత్‌కు ఉన్నదేంటి?.. ప్రణీతకు లేనిదేంటి?: దివ్యవాణి

ABN , First Publish Date - 2020-09-29T15:44:39+05:30 IST

సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు సైతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని సినీనటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి అన్నారు.

రకుల్‌ప్రీత్‌కు ఉన్నదేంటి?.. ప్రణీతకు లేనిదేంటి?: దివ్యవాణి

సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు సైతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని సినీనటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి అన్నారు. టాలీవుడ్‌కు సంబంధించిన డ్రగ్స్‌ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలన్నారు. సోమవారం టీడీపీ-టీఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘తెలంగాణ మహిళా కమిషన్‌ ఆవశ్యకత-ఏర్పాటు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో దివ్యవాణి మాట్లాడారు. వివిధ రంగాల్లో ఉన్నట్లుగానే సినీరంగంలోనూ డబ్బున్న వాళ్లదే రాజ్యమని తెలిపారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? అని ప్రశ్నించారు. రకుల్‌కే వరుస ఆఫర్లు వస్తున్నాయని, ప్రణీతలాంటి మంచి అమ్మాయిలకు ఆఫర్లు ఇవ్వాడానికి సినీపెద్దలు ఎందుకు ముందుకు రావడంలేదన్నారు. వివిధ అవసరాల కోసం దిగజారే వారు సినీరంగంలో ఉన్నారని, అలాంటి వాళ్లకే ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. తన కూతురు చదువుతున్న కాలేజీలోనూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. Updated Date - 2020-09-29T15:44:39+05:30 IST