పీపీఈ సూట్‌లో స్టార్ హీరోయిన్!

ABN , First Publish Date - 2020-06-12T16:22:02+05:30 IST

గత 70 రోజులుగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

పీపీఈ సూట్‌లో స్టార్ హీరోయిన్!

గత 70 రోజులుగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల లాక్‌డౌన్ నిబంధనలకు కాస్త సడలింపులు ఇవ్వడంతో బయట ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేశాయి. దీంతో షూటింగ్‌లు ఒక్కొక్కటీ ప్రారంభమవుతున్నాయి. 


తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బయటకు వచ్చింది. ముంబై విమానాశ్రయంలో వింత గెటప్‌తో దర్శనిమిచ్చింది. 95 మాస్క్, గ్లోవ్స్‌, అరికాలి నుంచి తల వరకు మొత్తం దుస్తులు ధరించింది. ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణమైంది. బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసమే రకుల్ ఢిల్లీ వెళుతున్నట్టు సమచాారం. 

Updated Date - 2020-06-12T16:22:02+05:30 IST