ధనుష్ ‘రకిట రకిట...’ సాంగ్ రిలీజ్
ABN , First Publish Date - 2020-07-28T16:12:49+05:30 IST
కోలీవుడ్ స్టార్ ధనుశ్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘జగమే తంత్రం’. తమిళంలో జగమే తంతిరమ్ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుంది.

కోలీవుడ్ స్టార్ ధనుశ్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘జగమే తంత్రం’. తమిళంలో జగమే తంతిరమ్ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై శశికాంత్ నిర్మిస్తున్నారు. సంతోశ్ నారాయణన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుండి మంగళవారం ‘రకిట రకిట..’ అనే సాంగ్‌ను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ధనుశ్ నటిస్తోన్న 40వ చిత్రమిది. భాస్కరభట్ల సంగీతం అందించారు. వెంకట్ కాచర్ల డైలాగ్స్ అందిస్తున్నారు.