10 రోజ‌ల క్రితం త‌ల్లి పేరుతో పోస్ట్‌, ఫొటో షేర్ చేసిన సుశాంత్‌!

ABN , First Publish Date - 2020-06-15T16:50:41+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలోగ‌ల‌ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ నేప‌ధ్యంలో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌తీవారు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

10 రోజ‌ల క్రితం త‌ల్లి పేరుతో పోస్ట్‌, ఫొటో షేర్ చేసిన సుశాంత్‌!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలోగ‌ల‌ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ నేప‌ధ్యంలో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌తీవారు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కా‌గా సుశాంత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు.  సుశాంత్ 10 రోజుల క్రితం తన తల్లి గురించి ఒక పోస్ట్ పెట్టారు. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పోస్టులో సుశాంత్‌.... మసకబారిన గతమంతా కన్నీరుగా జారి ఆవిరైపోతోంది. అంతులేని కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని మ‌లుస్తున్నాయి. ఈ రెండిటి మధ్యనే బతుకుతున్నాను... అమ్మా! అని రాశారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 16 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడే అత‌ని త‌ల్లి మ‌ర‌ణించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 1986 జ‌న‌వ‌రి 21 న‌ బీహార్‌లోని పట్నాలో జన్మించారు. సుశాంత్ న‌టించిన చివ‌రి సినిమా చందమామా డోర్ కే బడ్జెట్ లేకపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. 

Updated Date - 2020-06-15T16:50:41+05:30 IST