పాక్‌ ప్రభుత్వ ఆధీనంలో బాలీవుడ్‌ లెజెండ్రీ యాక్టర్స్‌ ఇళ్లు

ABN , First Publish Date - 2020-09-29T14:57:14+05:30 IST

బాలీవుడ్‌ లెజెండ్రీ యాక్టర్స్‌ రాజ్‌కపూర్‌, దిలీప్‌ కుమార్‌ ఇళ్లను పాక్‌ ప్రభుత్వం చారిత్రక సంపదగా గుర్తించి నిధులు కేటాయించింది.

పాక్‌ ప్రభుత్వ ఆధీనంలో బాలీవుడ్‌ లెజెండ్రీ యాక్టర్స్‌ ఇళ్లు

బాలీవుడ్‌ లెజెండ్రీ యాక్టర్స్‌ రాజ్‌కపూర్‌, దిలీప్‌ కుమార్‌ ఇళ్లను పాక్‌ ప్రభుత్వం చారిత్రక సంపదగా గుర్తించి నిధులు కేటాయించింది. వివరాల్లోకెళ్తే.. రాజ్‌కపూర్‌ పూర్వీకులు నిర్మించిన కపూర్‌ హవేలీ పెషావర్‌లోని ఖిస్సా ఖ్వానీ జబార్‌లో ఉంది. రాజ్‌కపూర్‌ అక్కడే జన్మించారు. అదే ప్రాంతంలో దిలీప్‌కుమార్‌ పూర్వీకులు నిర్మించిన ఇల్లు కూడా ఉంది. ఈ లెజెండ్రీ యాక్టర్స్‌ ఇళ్లను పాక్‌లోని ఖైబర్‌ పంఖ్తుంక్వా రాష్ట్ర ప్రభుత్వం సొంతం చేసుకోనుంది. వందేళ్లు దాటిన రాజ్‌కపూర్‌, దిలీప్‌ కుమార్‌ ఇళ్లను 2014లో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది. పాక్‌ పురావస్తుశాఖ తమ ఆధీనంలోకి ఈ లెజెండ్రీ యాక్టర్స్‌ ఇళ్లను తీసుకుని మరమత్తులు చేయించి నిర్వహణ చేయనుంది. 


Updated Date - 2020-09-29T14:57:14+05:30 IST