సూపర్‌స్టార్ దీపావళి సెలబ్రేషన్స్
ABN , First Publish Date - 2020-11-14T23:43:46+05:30 IST
సూపర్‌స్టార్ రజినీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.

చీకట్లను పారదోలి వెలుగులు నింపే పండుగ అని దీపావళిని అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే ఈ దీపావళి పండుగను మన సెలబ్రిటీలందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రేక్షకాభిమానులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. రజినీకాంత్‌తో కలిసి ఆయన శ్రీమతి లతతో పాటు కుమార్తె సౌందర్య రజినీకాంత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.