శింబుకు పెళ్ళి ఫిక్స్‌ కాలేదు: టి.రాజేంద‌ర్‌

ABN , First Publish Date - 2020-06-08T16:56:05+05:30 IST

యువ నటుడు శింబుకు లండన్‌ యువతితో పెళ్లి సంబంధం కుదిరినట్టు వెలువడిన వార్తలను ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు టి.రాజేందర్‌ ఖండించారు.

శింబుకు పెళ్ళి ఫిక్స్‌ కాలేదు:  టి.రాజేంద‌ర్‌

యువ నటుడు శింబుకు లండన్‌ యువతితో పెళ్లి సంబంధం కుదిరినట్టు వెలువడిన వార్తలను ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు టి.రాజేందర్‌ ఖండించారు. శింబుకు కొన్నేళ్లుగా పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతు న్నాయి. జాతకం కుదిరిన అమ్మాయిలు శింబుకు నచ్చడం లేదు. జాతకం, అమ్మాయి రెండూ శింబుకు నచ్చితే తల్లిదండ్రులకు ఆ సంబంధం నచ్చడం లేదు. ఇలా కొద్ది నెలలుగా శింబుకు అనువైన వధువు కోసం వెదుకులాట జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శింబుకు లండన్‌లోని కోటీశ్వరుడి కుమార్తెతో పెళ్లి  నిశ్చయమైందన్న వార్త వెలువడింది. ఆదివారం ఉదయం శింబు తండ్రి టి.రాజేందర్‌ ఆ వార్తపై స్పందించారు. తన కుమారుడికి ఇంకా పెళ్లి ఫిక్స్‌ కాలేదని తెలిపారు. తగిన వధువు కోసం వెదుకుతున్నామని, సంబంధం కుదిరితే మొదట మీడియాకే ఆ విషయాన్ని చెబుతానని, అంతవరకూ ఇలాంటి వదంతులను నమ్మవద్దని పేర్కొన్నారు.

Updated Date - 2020-06-08T16:56:05+05:30 IST