నా చెల్లెలు లేని లోటు తెలుస్తుంది: రాజీవ్ కనకాల

ABN , First Publish Date - 2020-08-04T00:33:19+05:30 IST

తన చెల్లెలు లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది అన్నారు సినీ నటుడు రాజీవ్ కనకాల. అన్నా చెల్లెల మ‌ధ్య అనుబంధం, ప్రేమ‌ల‌ను తెలియ‌జేసే పండుగ

నా చెల్లెలు లేని లోటు తెలుస్తుంది: రాజీవ్ కనకాల

తన చెల్లెలు లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది అన్నారు సినీ నటుడు రాజీవ్ కనకాల. అన్నా చెల్లెల మ‌ధ్య అనుబంధం, ప్రేమ‌ల‌ను తెలియ‌జేసే పండుగ ర‌క్షాబంధ‌న్. ఆ పండుగను పురస్కరించుకుని తన చెల్లిని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల తన చెల్లెలు శ్రీలక్మి కనకాల క్యాన్సర్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. తన చెల్లెలు ఉండి ఉంటే.. ఈ రోజు రాఖీ కట్టి ఉండేదని, ఆమె లేని లోటు ఇప్పుడు తెలుస్తుందని రాజీవ్ కనకాల ట్వీట్ చేశారు.


‘‘నా సోదరి నాపై చూపించే అనురాగానికి విలువ కట్టలేను. ప్రతి రాఖీ పౌర్ణమి రోజున తను నాకు రాఖీ కడ్తుంటే అప్పుడు నాకు ఆ విలువ తెలిసేది కాదు. నిజమేనేమో, ఎవరైనా మనకు దూరం ఐతే తప్ప ఆ విలువ తెలీదు కావచ్చు. ఈ రాఖీ పౌర్ణమికి నా చెల్లెలు లేని లోటు నేను మాటలో చెప్పలేను..’’ అని రాజీవ్ కనకాల తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Updated Date - 2020-08-04T00:33:19+05:30 IST