మరో విషాదం.. బాలీవుడ్ డైరెక్టర్ కన్నుమూత

ABN , First Publish Date - 2020-07-19T20:21:50+05:30 IST

బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ర‌జ‌త్ ముఖ‌ర్జీ మ‌ర‌ణించారు. జైపూర్‌లోని త‌న స్వ‌స్థ‌లంలో ర‌జ‌త్ ముఖ‌ర్జీ అనారోగ్యంతో క‌న్నుమూశారు.

మరో విషాదం.. బాలీవుడ్ డైరెక్టర్ కన్నుమూత

బాలీవుడ్‌లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇర్ఫాన్ ఖాన్‌, రిషి క‌పూర్‌, స‌రోజ్ ఖాన్‌, వాజిద్ ఖాన్, జ‌గ‌దీష్‌, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, రాజ‌న్ సెహ‌గ‌ల్ ఇలా.. ప్ర‌ముఖులు క‌న్నుమూశారు. ఇప్పుడు మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ర‌జ‌త్ ముఖ‌ర్జీ మ‌ర‌ణించారు. జైపూర్‌లోని త‌న స్వ‌స్థ‌లంలో ర‌జ‌త్ ముఖ‌ర్జీ అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఈయ‌న ప్యార్ తూనే క్యా కియా, ల‌వ్ ఇన్ నేపాల్‌, ఇష్క్ కిల్స్ వంటి చిత్రాల‌ను ర‌జ‌త్ ముఖ‌ర్జీ డైరెక్ట్ చేశారు. ఈయ‌న మృతికి మ‌నోజ్ బాజ్‌పాయ్ స‌హా బాలీవుడ్ ప‌రిశ్ర‌మ సంతాపాన్ని ప్ర‌క‌టించింది. 

Updated Date - 2020-07-19T20:21:50+05:30 IST