మహేష్-రాజమౌళి సినిమా ఎలా ఉంటుంది?

ABN , First Publish Date - 2020-04-25T21:37:05+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు.

మహేష్-రాజమౌళి సినిమా ఎలా ఉంటుంది?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరబోతోంది. `ఆర్ఆర్ఆర్` తర్వాత మహేష్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తానని రాజమౌళి వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు ప్రారంభమయ్యాయి.


జేమ్స్‌బాండ్ తరహాలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తల గురించి రాజమౌళి స్పందించారు. `మహేష్‌తో సినిమా ఎలా ఉంటుందనేది నాకు కూడా తెలీదు. మహేష్‌తో కూడా కథ గురించి చర్చ జరగలేదు. మహేష్ ఇమేజ్‌కు అనుగుణంగా, నా అభిరుచికి తగినట్టుగా ఆ సినిమా ఉంటుంది. `ఆర్ఆర్ఆర్` తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత మహేష్ సినిమాను ప్రారంభిస్తాన`ని రాజమౌళి చెప్పారు. 

Updated Date - 2020-04-25T21:37:05+05:30 IST