ట్రోల్స్‌కు జ‌క్క‌న్న క్లారిటీ

ABN , First Publish Date - 2020-04-25T14:54:38+05:30 IST

ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మాట్లాడుతూ ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘పార‌సైట్‌’ తనకు నచ్చలేదని ఆ సినిమా చూసేట‌ప్పుడు తాను నిద్ర‌పోయాన‌ని ఆయ‌న అన్నారు. దాంతో ఆయ‌న‌పై ట్రోలింగ్స్ మొద‌ల‌య్యాయి.

ట్రోల్స్‌కు జ‌క్క‌న్న క్లారిటీ

ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మాట్లాడుతూ ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘పార‌సైట్‌’ తనకు నచ్చలేదని ఆ సినిమా చూసేట‌ప్పుడు తాను నిద్ర‌పోయాన‌ని ఆయ‌న అన్నారు. దాంతో ఆయ‌న‌పై ట్రోలింగ్స్ మొద‌ల‌య్యాయి. అయితే ఈ ట్రోలింగ్స్‌కు జ‌క్క‌న్న మ‌రో ఇంట‌ర్వ్యూ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. ‘‘‘పార‌సైట్‌’ నచ్చకపోవడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక జ్యూరీలో చాలా లాబీయింగ్ ఉంటుంది. ఓ సినిమాను జ్యూరీ స‌భ్యులు చూడాలంటే చాలా త‌తంగం న‌డుస్తుంది. అయితే చెత్త సినిమాను తీసుకెళ్లి పాస్ చేయించి అవార్డ్ తీసుకునే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటారు. దానిపై నాకు ప‌రిజ్ఞానం లేదు. గ‌తంలో కూడా నాకు ఆస్కార్ గెలిచిన కొన్ని చిత్రాలు న‌చ్చాయి, కొన్ని న‌చ్చ‌లేదు’’ అన్నారు. 

Updated Date - 2020-04-25T14:54:38+05:30 IST