రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్!

ABN , First Publish Date - 2020-10-27T22:04:07+05:30 IST

కోవిడ్‌తో బాధపడుతున్న సీనియర్ నటుడు రాజశేఖర్‌కు ప్లాస్మా థెరపీ చేసినట్టు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు వెల్లడించారు

రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్!

కోవిడ్‌తో బాధపడుతున్న సీనియర్ నటుడు రాజశేఖర్‌కు ప్లాస్మా థెరపీ చేసినట్టు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు వెల్లడించారు. రాజశేఖర్ ఆరోగ్యంపై హాస్పిటల్ యాజమాన్యం తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. 


ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని, నాన్ ఇన్ వాసివ్ వెంటిలేషన్‌పై చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. అలాగే సైటోసార్బ్ పరికరం ద్వారా కూడా చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. గతంతో పోలిస్తే రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని బులిటెన్‌లో పేర్కొన్నారు. వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.  

Updated Date - 2020-10-27T22:04:07+05:30 IST