గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న రాజా రవీంద్ర

ABN , First Publish Date - 2020-11-03T21:50:03+05:30 IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రముఖ నటుడు రాజా రవీంద్ర పాల్గొన్నారు. అందులో భాగంగా నటి తులసి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు గండిపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారాయన.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న రాజా రవీంద్ర

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రముఖ నటుడు రాజా రవీంద్ర పాల్గొన్నారు. అందులో భాగంగా నటి తులసి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు గండిపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమైనది. రోజురోజుకు పెరుగుతున్న జనాభా వల్ల మనం నివసించడం కోసం మొక్కలను కూడా నరికివేసి ఇళ్లను కట్టుకుంటున్నాం.  కానీ వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలి.  ఎందుకంటే మొక్కలు మనకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు పెంచడం కోసం కృషి చేయాలి. ఇంత మంచి కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యులు చేస్తున్న సంతోష్‌ కుమార్‌గారికి థాంక్స్‌" అన్నారు.  ఈ సందర్భంగా హీరో నిఖిల్, సునీల్, నవీన్ చంద్రలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్  స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు రాజా రవీంద్ర.


Updated Date - 2020-11-03T21:50:03+05:30 IST