బాలీవుడ్ రీమేక్‌లో రాజ్‌త‌రుణ్‌

ABN , First Publish Date - 2020-05-13T19:07:01+05:30 IST

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉన్న స‌మ‌యంలో క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది.

బాలీవుడ్ రీమేక్‌లో రాజ్‌త‌రుణ్‌

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉన్న స‌మ‌యంలో క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ఈయ‌న త‌దుప‌రి సినిమాపై ప‌లు వార్త‌లు విన‌ప‌డుతూ వ‌స్తున్నాయి. బాలీవుడ్ మూవీ ‘డ్రీమ్‌గ‌ర్ల్‌’ చిత్రంలో రాజ్‌త‌రుణ్ న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో రాజ్‌త‌రుణ్ ఓ ఇంటర్వ్యూలో త‌న త‌దుప‌రి సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టించిన ‘డ్రీమ్ గ‌ర్ల్’ చిత్రంలో నటించనున్నట్లు కన్‌ఫ‌ర్మ్ చేశారు.  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మితం కానుంది. 

Updated Date - 2020-05-13T19:07:01+05:30 IST