ఆ హీరోయిన్‌తో క్రికెటర్ ప్రేమ నిజమేనా?

ABN , First Publish Date - 2020-11-06T22:28:16+05:30 IST

బాలీవుడ్, క్రికెట్ మధ్య ఎప్పట్నుంచో అవినాభావ సంబంధం ఉంది.

ఆ హీరోయిన్‌తో క్రికెటర్ ప్రేమ నిజమేనా?

బాలీవుడ్, క్రికెట్ మధ్య ఎప్పట్నుంచో అవినాభావ సంబంధం ఉంది. క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్లు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం కూడా మనకు కొత్త కాదు. తాజాగా మరో జంట అదే దారిలో నడుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీమిండియా యువ క్రికెటర్ కేఎల్ రాహుల్, సునీల్ శెట్టి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ప్రేమలో ఉన్నట్టు జాతీయ మీడియా వర్గాల టాక్. 


వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై ఇద్దరూ స్పందించలేదు. తాజాగా అతియాకు బర్త్ డే విషెస్ చెబుతూ రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో రాహుల్, అతియా క్లోజ్‌గా ఉన్నారు. ఈ ఫొటోపై రాహుల్ స్నేహితుడు, టీమిండియా క్రికెటర్ స్పందిస్తూ.. `మై లవ్లీస్` అని కామెంట్ చేశాడు. అలాగే మరికొందరు టీమిండియా క్రికెటర్లు `థమ్సప్` సింబల్‌ను పోస్ట్ చేశారు. Updated Date - 2020-11-06T22:28:16+05:30 IST