కొత్త సినిమాను అనౌన్స్‌ చేస్తున్న దర్శకేంద్రుడు

ABN , First Publish Date - 2020-10-08T03:01:40+05:30 IST

శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు, ఆయన దర్శక నిర్మాణంలో రూపొందబోయే చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను చేయనున్నారు.

కొత్త సినిమాను అనౌన్స్‌ చేస్తున్న దర్శకేంద్రుడు

తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులను అద్దిన అగ్ర దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు. ఆయన దర్శకత్వంలో 2017లో విడుదలైన ఓంనమో 'వేంకటేశాయ' తర్వాత మరో సినిమాను ఆయన తెరకెక్కించలేదు. అయితే త్వరలోనే దర్శకేంద్రుడు దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ మారుతున్నారు. శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు, ఆయన దర్శక నిర్మాణంలో రూపొందబోయే చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను చేయనున్నారు. కొత్త నటీనటులతోనే రాఘవేంద్రరావు సినిమా చేస్తున్నారని సమాచారం. సీనియర్‌ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తారు. 
Updated Date - 2020-10-08T03:01:40+05:30 IST