‘చంద్రముఖి 2’పై వస్తున్న వార్తల్లో నిజం లేదు: లారెన్స్

ABN , First Publish Date - 2020-08-02T03:28:23+05:30 IST

ఇటీవల ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ రూపొందించబోతోన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల

‘చంద్రముఖి 2’పై వస్తున్న వార్తల్లో నిజం లేదు: లారెన్స్

ఇటీవల ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ రూపొందించబోతోన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల అనంతరం ‘చంద్రముఖి’లో చేసిన జ్యోతిక ఈ చిత్రంలో కూడా చేస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జ్యోతిక స్థానంలో సిమ్రాన్‌ను తీసుకుంటున్నారని, ఆ తర్వాత కియారా అద్వానీ అనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో అసలు ఈ చిత్రంలో ఎవరు నటిస్తున్నారనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. రీసెంట్‌గా సిమ్రాన్ ఈ వార్తలను ఖండించింది. తాజాగా దర్శకుడు రాఘవ లారెన్స్ తన ట్విట్టర్ ద్వారా ఈ వార్తలపై స్పందించారు.


‘‘మీడియా మిత్రులకు.. చంద్రముఖి 2 చిత్రానికి సంబంధించి హీరోయిన్ విషయంలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జ్యోతిక మేడమ్, సిమ్రాన్ మేడమ్ లేదా కైరా అద్వానీ నటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలేవీ నిజంకావు. అవన్నీ ఫేక్ న్యూస్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ ఫీమేల్ లీడ్ విషయమై క్లారిటీ ఇస్తుంది. అప్పుడు మేము అధికారికంగా ప్రకటిస్తాము..’’ అని లారెన్స్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.Updated Date - 2020-08-02T03:28:23+05:30 IST