రాధికా కుమార స్వామి 'కాళికా'

ABN , First Publish Date - 2020-12-27T20:40:59+05:30 IST

క్వీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాధికా కుమారస్వామి ప్రధాన పాత్రలోనటించిన కన్నడ చిత్రం 'దమయంతి'. ఈ చిత్రాన్నితెలుగులో 'కాళికా' పేరుతో విడుదల చేస్తున్నారు.

రాధికా కుమార స్వామి 'కాళికా'

క్వీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాధికా కుమారస్వామి ప్రధాన పాత్రలోనటించిన కన్నడ చిత్రం 'దమయంతి'. ఈ చిత్రాన్నితెలుగులో 'కాళికా' పేరుతో విడుదల చేస్తున్నారు. సౌరవ్ లోకేష్,శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల,తబ్లా నాని,అంజనా నటీ నటులు. నట్టి కరుణ,నట్టి క్రాంతి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ నట్టి క్రాంతిలు మాట్లాడుతూ "రాధికా కుమారస్వామి లీడ్ పాత్రలో నటించిన కన్నడ చిత్రం 'దమయంతి'. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో 'కాళికా' పేరుతో విడుదల చేస్తున్నాం. ఈ సినిమాను 18 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన హర్రర్ గ్రాఫిక్స్‌తో తెరకెక్కించారు. కన్నడలో  ఈ చిత్రం  ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలుగులో కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది" అని అన్నారు.


Updated Date - 2020-12-27T20:40:59+05:30 IST