వీసా కోసమే వివాహం: రాధికా ఆప్టే
ABN , First Publish Date - 2020-10-25T17:22:56+05:30 IST
తెలుగులో ‘రక్తచరిత్ర’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే...

తెలుగులో ‘రక్తచరిత్ర’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే తన వివాహంపై సంచలన కామెంట్లు చేసింది. తనకు పెళ్లిపై ఏ మాత్రం నమ్మకమే లేదని రాధిక స్పష్టం చేసింది. అయితే సులభంగా వీసా వస్తుందన్న కారణంతోనే పెళ్లి చేసుకున్నానంటూ వ్యాఖ్యానించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి రాధికా ఆప్టే మాట్లాడుతూ... విదేశాల్లో ఉన్న వ్యక్తిని పెళ్లాడితే వీసా సులువుగా వస్తుందని తెలుసుకొని, తాను పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది. ప్రస్తుతం తాను తన భర్తతో కలిసి జీవిస్తున్నట్టు తెలిపింది. కాగా రాధికా ఆప్టే 2012లో బ్రిటిష్ మ్యుజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను వివాహం చేసుకుంది. అనంతరం సినిమాల్లో కొనసాగింది. ప్రస్తుతం లండన్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నా, సినిమాల కోసం ఎక్కువకాలం భారత్‌లోనే ఉంటోంది.

Read more