సినిమాలను పక్కనపెట్టి రెస్టారెంట్ ఓపెన్ చేస్తే..: రాధిక

ABN , First Publish Date - 2020-06-08T17:59:55+05:30 IST

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే ప్రస్తుత లాక్‌డౌన్ సమయాన్ని బాగా ఆస్వాదిస్తోందట.

సినిమాలను పక్కనపెట్టి రెస్టారెంట్ ఓపెన్ చేస్తే..: రాధిక

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే ప్రస్తుత లాక్‌డౌన్ సమయాన్ని బాగా ఆస్వాదిస్తోందట. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆమెకు కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయట. వాటి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక వెల్లడించింది. 


`గత ఎనిమిదేళ్లు విరామం అనేది లేకుండా పనిచేశాను. లాక్‌డౌన్ కారణంగా దొరికిన ఈ విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నాను. స్వయంగా కథలు రాసుకుంటున్నాను. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. అసంతృప్తి ఎక్కువైతే జీవితంలో సంతోషం దూరమవుతుంది. ఈ విరామ సమయంలో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. సినిమా కెరీర్‌ను పూర్తిగా పక్కనపెట్టి రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా వచ్చింద`ని రాధిక తెలిపింది. 

Updated Date - 2020-06-08T17:59:55+05:30 IST