ఇటలీ నుంచి వచ్చేశారు
ABN , First Publish Date - 2020-11-04T07:14:15+05:30 IST
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ ఇటలీ షెడ్యూల్ పూర్తయింది. అక్కడ కరోనా వైరస్ రెండో దశ మొదలైనప్పటికీ...

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ ఇటలీ షెడ్యూల్ పూర్తయింది. అక్కడ కరోనా వైరస్ రెండో దశ మొదలైనప్పటికీ చిత్ర యూనిట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ పూర్తి చేసుకొంది. అక్కడ కీలక సన్నివేశాలతోపాటు పాటల్ని తెరకెక్కించారు. సోమవారం ‘రాధేశ్యామ్’ బృందం హైదరాబాద్‌కి చేరుకుంది. త్వరలో తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకానుంది. దీని కోసం అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిల్మ్‌సిటీలో సెట్లు వేస్తున్నారని సమాచారం. మరో 20 రోజులు చిత్రీకరణ జరిపితే సినిమా పూర్తవుతుందని తెలిసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తున్న పూజా హెగ్డే ఇటలీ ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ‘‘టీమ్ అందరి సహకారంతో ఇటలీ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. త్వరలో హైదరాబాద్‌లో కలుద్దాం’’ అని పోస్ట్ చేశారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
Read more