రికార్డ్ క్రియేట్‌ చేసిన ‘రాధేశ్యామ్’ మోషన్‌ పోస్టర్‌

ABN , First Publish Date - 2020-10-28T03:08:38+05:30 IST

యంగ్‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి తన పుట్టినరోజు సందర్భంగా బీట్స్ ఆఫ్‌ రాధేశ్యామ్‌ అంటూ ఓ స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే

రికార్డ్ క్రియేట్‌ చేసిన ‘రాధేశ్యామ్’ మోషన్‌ పోస్టర్‌

యంగ్‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి తన పుట్టినరోజు సందర్భంగా బీట్స్ ఆఫ్‌ రాధేశ్యామ్‌ అంటూ ఓ స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. ఈ టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. రికార్డ్‌లు కూడా క్రియేట్‌ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో ఈ మోషన్‌ పోస్టర్‌ 25 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌ సాధించి.. ఇండియన్‌ సినిమాలో అత్యధిక వ్యూస్‌ సాధించిన మోషన్‌ పోస్టర్‌గా రికార్డ్‌ను క్రియేట్‌ చేసినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. 


ఈ చిత్రం కోసం అభిమానులే కాదు.. ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. ప్రభాస్‌ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్ర‌స్తుతం ఇట‌లీలో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని  తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.Updated Date - 2020-10-28T03:08:38+05:30 IST