జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతంలో ‘రాధే శ్యామ్‌’

ABN , First Publish Date - 2020-10-21T10:27:43+05:30 IST

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్‌’. ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రానికి చక్కని బాణీలు అందించిన జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ సినిమాకు...

జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతంలో ‘రాధే శ్యామ్‌’

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్‌’.  ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రానికి చక్కని బాణీలు అందించిన జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ఆయనకిది రెండో చిత్రం. తెలుగు సహా ‘రాధే శ్యామ్‌’ తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్‌కి జస్జిన్‌ ప్రభాకరన్‌ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే హిందీ వెర్షన్‌కి ఎవరు సంగీతం అందిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న మోషన్‌ పోస్టర్‌ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం యూరప్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్‌ దర్శకుడు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రసీధ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Updated Date - 2020-10-21T10:27:43+05:30 IST