సంగీతంతో ‘రాధే శ్యామ్‌’ వస్తారు!

ABN , First Publish Date - 2020-10-18T06:44:16+05:30 IST

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్‌’. ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు రాధాకృష్ణకుమార్‌, ఇతర కీలక చిత్రబృందం యూరప్‌లో ఉన్నప్పటికీ...

సంగీతంతో ‘రాధే శ్యామ్‌’ వస్తారు!

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్‌’. ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు రాధాకృష్ణకుమార్‌, ఇతర కీలక చిత్రబృందం యూరప్‌లో ఉన్నప్పటికీ... ఈ నెల 23 ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున ప్రభాస్‌ అభిమానుల కోసం ఓ కానుకను ఇవ్వనున్నారు. ‘బీట్స్‌ ఆఫ్‌ రాధే శ్యామ్‌’ పేరుతో మోషన్‌ పోస్టర్‌ విడుదల చేయనున్నారు. ‘‘అక్టోబర్‌ 23న మోషన్‌ పోస్టర్‌ ద్వారా ‘రాధే శ్యామ్‌’ బీట్స్‌ ఫీల్‌ అవ్వండి’’ అని ప్రభాస్‌ పేర్కొన్నారు. ఆ రోజున హీరో హీరోయిన్ల కొత్త స్టిల్‌ విడుదల చేయనున్నారనీ, ముఖ్యంగా నేపథ్య సంగీతంతో ‘రాధే శ్యామ్‌’ వస్తారనీ సమాచారం. ప్రభాస్‌ సోలో స్టిల్‌ సైతం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటివరకూ చిత్రసంగీత దర్శకుడు ఎవరన్నది ప్రకటించలేదు. మోషన్‌ పోస్టర్‌తో ప్రకటిస్తారేమో చూడాలి. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రశీద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్‌, భాగ్యశ్రీ, కునాల్‌ రాయ్‌ కపూర్‌, జగపతిబాబు, జయరామ్‌, సచిన్‌ ఖడేకర్‌, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.

Updated Date - 2020-10-18T06:44:16+05:30 IST