సినీ కార్మికుల కోసం రూ.3 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన కె.కె.రాధామోహ‌న్‌

ABN , First Publish Date - 2020-04-06T17:37:20+05:30 IST

నిర్మాత, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కె కె రాధామోహన్ 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

సినీ కార్మికుల కోసం రూ.3 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన కె.కె.రాధామోహ‌న్‌

కరోనా సమస్య వలన షూటింగ్ లు అన్నీ ఆగిపోయి వాటి మీదే ఆధారపడి వున్న సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) కి తనవంతు సహాయంగా 'ఒరేయ్.. బుజ్జిగా' నిర్మాత, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కె కె రాధామోహన్ 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇలాంటి ఊహించని కష్ట కాలంలో చేతనైనంత సహాయం చేయడం ద్వారానే కలిసికట్టుగా కరోనా ను జయించవచ్చని రాధామోహన్ అన్నారు అలానే అందరినీ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే సురక్షితంగా ఉండమని కోరారు.

Updated Date - 2020-04-06T17:37:20+05:30 IST