మా పెళ్లికి కరోనా బ్రేక్ వేసింది: రణ్‌బీర్

ABN , First Publish Date - 2020-12-25T15:55:06+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమాయణం కొద్ది సంవత్సరాలుగా ట్రెండింగ్‌లో ఉంది.

మా పెళ్లికి కరోనా బ్రేక్ వేసింది: రణ్‌బీర్

బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమాయణం కొద్ది సంవత్సరాలుగా ట్రెండింగ్‌లో ఉంది. వీరి ప్రేమ గురించి, పెళ్లి గురించి జాతీయ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే తమ ప్రేమ వ్యవహారం గురించి, మీడియాలో తమపై వస్తున్న వార్తల గురించి ఇప్పటివరకు రణ్‌బీర్ పెద్దగా స్పందించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రణ్‌బీర్.. ఆలియాతో ప్రేమాయణం గురించి మాట్లాడాడు. ఆలియాను `గాళ్‌ఫ్రెండ్`గా సంబోధించాడు.


`మహమ్మారి మన జీవితాల్లోకి ప్రవేశించకపోయి ఉంటే ఇప్పటికే మా పెళ్లి అయిపోయి ఉండేది. పెళ్లి గురించి ఇప్పుడు ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను. కానీ, ఆ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోవాలనుకుంటున్నాను. లాక్‌డౌన్ సమయంలో ఆలియా చాలా విషయాలు నేర్చుకుంది. గిటార్ నుంచి స్క్రీన్ రైటింగ్ వరకు.. చాలా విషయాల్లో పురోగతి సాధించింది. తనతో నేను ఏ విషయంలోనూ పోటీ పడలేను. లాక్‌డౌన్ సమయంలో నేను నా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపాను. కొన్ని పుస్తకాలు చదివాను. ప్రతిరోజూ రెండు, మూడు సినిమాలు చూశాన`ని రణ్‌బీర్ తెలిపాడు. 

Updated Date - 2020-12-25T15:55:06+05:30 IST