మ‌రో టాలెంట్‌ను ప్ర‌దర్శించిన రాశీఖ‌న్నా

ABN , First Publish Date - 2020-05-26T17:55:19+05:30 IST

రాశీ త‌న‌లో మ‌రో ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. చిన్న‌ప్పుడు నేర్చుకున్న గిటార్‌తో త‌న ఫేవ‌రేట్ సాంగ్‌ను ప్లే చేసి దాన్ని ట్వీట్ చేసింది.

మ‌రో టాలెంట్‌ను ప్ర‌దర్శించిన రాశీఖ‌న్నా

అందాల క‌థానాయిక రాశీఖ‌న్నా గ‌త ఏడాది ప్ర‌తిరోజూ పండ‌గే, వెంకీమామ చిత్రాల‌తో స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి నిరాశ ఫ‌లితాన్ని ద‌క్కించుకుంది. గ్లామ‌ర్ ప‌రంగానే కాకుండా రాశీ మంచి టాలెంటెడ్‌. మంచి గాయ‌ని కూడా జోరు, ప్ర‌తిరోజూ పండ‌గే స‌హా కొన్ని చిత్రాల్లో పాట‌ల‌ను కూడా పాడింది. రీసెంట్‌గా రాశీ త‌న‌లో మ‌రో ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. చిన్న‌ప్పుడు నేర్చుకున్న గిటార్‌తో త‌న ఫేవ‌రేట్ సాంగ్‌ను ప్లే చేసి దాన్ని ట్వీట్ చేసింది. రాశీ టాలెంట్‌ను అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. Updated Date - 2020-05-26T17:55:19+05:30 IST