జెన్యూన్‌గా నచ్చిన హీరోయిన్ పేరు చెప్పిన రాశీఖన్నా

ABN , First Publish Date - 2020-05-04T04:25:08+05:30 IST

ప్రస్తుత లాక్‌డౌన్ సమయాన్ని నటీమణులు చక్కగా వినియోగించుకుంటున్నారు. వారు వర్కవుట్స్ చేస్తున్న వీడియోలు, వంటలు చేస్తున్న వీడియోలు ఇలా ఏదో ఒకటి సోషల్

జెన్యూన్‌గా నచ్చిన హీరోయిన్ పేరు చెప్పిన రాశీఖన్నా

ప్రస్తుత లాక్‌డౌన్ సమయాన్ని నటీమణులు చక్కగా వినియోగించుకుంటున్నారు. వారు వర్కవుట్స్ చేస్తున్న వీడియోలు, వంటలు చేస్తున్న వీడియోలు ఇలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. వారి అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకాస్త సమయం కేటాయించి సరదాగా అభిమానులతో ముచ్చటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రోజూ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు నెటిజన్లతో ముచ్చటిస్తూనే ఉన్నారు. ఆదివారం హీరోయిన్ రాశీఖన్నా.. నెటిజన్లతో కాసేపు ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. అయితే ఆమె చెప్పిన అన్ని సమాధానాలు చాలా జెన్యూన్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు.


ముఖ్యంగా మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు అని? ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె ‘సమంత’ అని తెలిపింది. అయితే ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్‌ని ఈ ప్రశ్న అడిగినా పాతతరం హీరోయిన్లలో ఏదో ఒక పేరు చెబుతున్నారు. కానీ రాశీఖన్నా మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ‘సమంత’ అని చెప్పడంతో.. సమంత అభిమానులందరూ ఇప్పుడు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తనతో పాటు సినిమాలు చేస్తున్న తోటి నటి పేరు చెప్పడం అంటే నిజంగా సాహసమే అని చెప్పాలి. ‘మనం’ సినిమాలో సమంతతో పాటు రాశీఖన్నా కూడా నటించింది. అలాంటిది ఆమే నా ఫేవరేట్ హీరోయిన్ అని రాశీఖన్నా చెప్పడం గొప్ప విషయమే. Updated Date - 2020-05-04T04:25:08+05:30 IST