‘నో పెళ్లి’ సాంగ్‌పై రాశీఖన్నా రియాక్షన్ ఇదే
ABN, First Publish Date - 2020-05-25T23:43:40+05:30
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకుడిగా
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’ను యువ కథానాయకుడు నితిన్ ట్విట్టర్ ద్వారా సోమవారం విడుదల చేశారు. ఈ సాంగ్‌లో సాయితేజ్‌తో పాటు వరుణ్‌తేజ్, రానా కూడా సందడి చేయడం విశేషం.
సాంగ్ విడుదల చేసిన తర్వాత ‘‘సాయితేజ్ ఇచ్చిన గిఫ్ట్ చాలా బావుంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సాంగ్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వెన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తాను. కొన్నిసార్లు చేసుకోవడంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కానీ, చేసుకోవడం మాత్రం పక్కా’’ అని నితిన్ తెలిపారు. వరుణ్ తేజ్, రానా కూడా ఈ సాంగ్‌పై స్పందించారు. సాయితేజ్‌తో రెండు సినిమాల్లో నటించిన రాశీఖన్నా తాజాగా ఈ సాంగ్‌పై ఫన్నీగా స్పందించింది. ‘‘తేజ్, నీ పెళ్లి రోజు నేను ఈ పాట పాడతాను.. మీ సాంగ్‌ను ఇష్టపడుతున్నాను..’’ అని రాశీ ఖన్నా ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్‌కు నెటిజన్లు ‘పెళ్లి రోజు కాదు.. సంగీత్ పార్టీలో పాడండి..’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ పాటను రఘురామ్ రాయగా.. అర్మాన్ మాలిక్ పాడారు. త్వరలోనే ఈ సినిమా విడుదలపై నిర్మాతలు అధికారిక ప్రకటన చేస్తారు. ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.