డిజిట‌ల్‌ను హీటెక్కించ‌నున్న ర‌త్తాలు

ABN , First Publish Date - 2020-02-08T19:55:12+05:30 IST

రాయ్ లక్ష్మీ బాలీవుడ్ లో 'నాగిని'గా రెచ్చిపోయి నటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సెక్సిణిగా ఈ అమ్మడికి ఓటీటీ వేదిక పై రొమాంటిక్ లవ్ స్టోరీల్లో అవకాశాలు వస్తున్నాయి.

డిజిట‌ల్‌ను హీటెక్కించ‌నున్న ర‌త్తాలు

లక్ష్మీ రాయ్.. ఈమెకు  ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆ మధ్య మెగా బ్రదర్స్‌తో చిందేసింది ఈ భామ. ఆ తర్వాత బాలీవుడ్‌ వెళ్లింది. అక్కడ 'జూలి 2' లో రెచ్చిపోయి అందాలతో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా పరువాల జాతర చేస్తోంది హాటీ. అయితే ఇలాంటి అందాల ఆరబోతతోనే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది రత్తాలు. 


రాయ్ లక్ష్మీ బాలీవుడ్ లో 'నాగిని'గా రెచ్చిపోయి నటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సెక్సిణిగా ఈ అమ్మడికి ఓటీటీ వేదిక పై రొమాంటిక్ లవ్ స్టోరీల్లో అవకాశాలు వస్తున్నాయి. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక పై ఈ అమ్మడికి 'పాయిజన్ 2'  వెబ్ సిరీస్‌లో అవకాశం దక్కింది. ఈ వెబ్ సిరీస్‌తో  రాయ్ లక్ష్మి  డిజిటల్ అరంగేట్రానికి సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదాసాని సరసన నటిస్తోంది 'జూలి' బ్యూటీ. ఇక  తాజాగా 'పాయిజన్ 2' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో ఆఫ్తాబ్‌తో రాయ్ లక్ష్మీ రొమాన్స్ హీటెక్కిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. 

Updated Date - 2020-02-08T19:55:12+05:30 IST