‘పుష్ప’ పాట‌లు రెడీ

ABN , First Publish Date - 2020-04-28T16:28:09+05:30 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. క‌రోనా ప్రభావం లేకుంటే ఈ పాన్ ఇండియా మూవీ ఈపాటికి సెట్స్‌పై ఉండాల్సింది. కరోనా దెబ్బ‌కు షూటింగ్ ఆగింది.

‘పుష్ప’ పాట‌లు రెడీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. క‌రోనా ప్రభావం లేకుంటే ఈ పాన్ ఇండియా మూవీ ఈపాటికి సెట్స్‌పై ఉండాల్సింది. కరోనా దెబ్బ‌కు షూటింగ్ ఆగింది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు లాక్‌డౌన్ ముందే దేవిశ్రీప్ర‌సాద్ ట్యూన్స్‌ను సిద్దం చేసేశార‌ట‌. బ‌న్నీ, సుకుమార్‌, దేవి విదేశాల‌కు వెళ్లి ట్యూన్స్‌ను ఓకే చేసేసుకున్నార‌ట‌. ట్యూన్స్ ప‌ట్ల బ‌న్నీ, సుకుమార్ హ్యాపీగా ఫీల‌య్యార‌ని, పాట‌తోనే పుష్ప సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తార‌ని దేవిశ్రీ ప్ర‌సాద్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ కూడా ఉంద‌ని దేవిశ్రీ ప్ర‌సాద్ క‌న్‌ప‌ర్మ్ చేసేశాడు. బ‌న్నీ, దేవిశ్రీ కాంబోలో ఆర్య‌, ఆర్య‌2, జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వంటి మ్యూజికల్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఉన్నాయి. మ‌రి ఈసారి ఈ జోడీ ఎలాంటి మ్యూజికల్ హిట్ అందుకోనుందో చూడాలి. 

Updated Date - 2020-04-28T16:28:09+05:30 IST