బాధ్యత ఉన్నవాళ్లకే ఆ ఆలోచన వస్తుంది: పూరీ జగన్నాథ్‌

ABN , First Publish Date - 2020-10-27T19:39:00+05:30 IST

''ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్ది మందిలోనే ఉంటుంది" అని అంటున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన 'సూసైడ్‌(ఆత్మహత్య)' గురించి మాట్లాడుతూ...

బాధ్యత ఉన్నవాళ్లకే ఆ ఆలోచన వస్తుంది:  పూరీ జగన్నాథ్‌

''ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్ది మందిలోనే ఉంటుంది" అని అంటున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన 'సూసైడ్‌(ఆత్మహత్య)' గురించి మాట్లాడుతూ "లైఫ్‌లో ఎన్నోసార్లు మనమీద మనకే చిరాకు దొబ్బుతుంది. వెధవ జీవితం చచ్చిపోదామనిపిస్తుంది. మనలో చాలా మందికి ఇలాంటి ఆలోచన వచ్చుంటుంది. ఇలా సూసైడ్‌ ఆలోచన ఉన్నోళ్లంటే నాకు చాలా రెస్పెక్ట్‌. ఎందుకంటే ఈ ఆలోచన ఇంటెలిజెంట్స్‌కే వస్తుంది. ఫూల్స్ ఎప్పుడూ అలా ఫీల్‌ కారు. అందరూ పిరికివాళ్లే ఆత్మహత్య చేసుకుంటారు అని అంటారు. కానీ నిజానికి చనిపోవడానికి ధైర్యముండాలి. అయినా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? కొన్ని సమస్యలు. ఫైనాన్సియల్‌ కావచ్చు, ఫ్యామిలీ సమస్యలు కావచ్చు. బాధ్యత తీసుకున్న వాళ్లు మాత్రమే ఇలాంటి మనస్తత్వానికి గురవుతారు. బాధ్యతారాహిత్యంగా ఉండేవాళ్లకి ఇలాంటి ఆలోచలు రావు. చావాల్సింది వాళ్లు.. నువ్వు కాదు. నీకు ప్రేమించే గుణముంది. తప్పు చేయవు. ఎవరైనా మాటంటే తట్టుకోలేవు. ఆత్మాభిమానం ఎక్కువ. పైగా ఇంటెలిజెంట్‌. దానికి తోడు చచ్చే దమ్ముంది. నీకు తెలుసా! ఇవన్నీ హీరో లక్షణాలు. నువ్వు హీరోవి.. నువ్వు చావడమేంటి" అంటూ పూరీ చెప్పిన 'సూసైడ్‌' మ్యూజింగ్‌లో మరిన్ని విషయాలు మీకోసం...




Updated Date - 2020-10-27T19:39:00+05:30 IST