సింపుల్‌గా బతకడం సులభం కాదు: పూరీ జగన్నాథ్‌

ABN , First Publish Date - 2020-10-25T18:49:37+05:30 IST

"ఏది జరగకూడదో అదిజరగడమే జీవితం. సింప్లిసిటీ అంటే ప్రెజంట్‌ను అంగీకరించడం" అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా సింప్లిసిటీ గురించి ఆయన మాట్లాడుతూ.......

సింపుల్‌గా బతకడం సులభం కాదు:  పూరీ జగన్నాథ్‌

"ఏది జరగకూడదో అదిజరగడమే జీవితం. సింప్లిసిటీ అంటే ప్రెజంట్‌ను అంగీకరించడం" అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా సింప్లిసిటీ గురించి ఆయన మాట్లాడుతూ "అన్నింటి కంటే కష్టం సింప్లిసిటీ. సింపుల్‌గా బతకడం అంత సులభమైన విషయం కాదు. అదే కావాలని కూర్చుంటే కుదరదు. దేనికైనా అడ్జస్ట్‌ కావడం నేర్చుకోవాలి. ఎందుకంటే లైఫ్‌ పర్‌ఫెక్ట్‌ కాదు, నువ్వు పర్‌ఫెక్ట్‌ కాదు. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోవడమే లైఫ్‌ అంటే. గుళ్లోకి వెళ్లి నాకిది కావాలి సామి అని మొక్కుతావ్‌.. అప్పుడు దేవుడికి ఓహో వీడికిది ఇవ్వకూడదు అని అర్థమవుతుంది. వెంటనే అది జరక్కుంగా చూడాలని పుసక్తంలో రాసుకుంటాడు. దేవుడేం చేస్తాడో తెలుసా! నీకున్న ఒక్క ఆవుని పోగొట్టి మళ్లీ నీకు దొరికేలా చేస్తాడు. ఈ మధ్యలోనే ఆయన బతికేది. అందుకే మన దగ్గర ఆవున్న విషయం దేవుడికి చెప్పొద్దు. ఆవు కావాలని కూడా ఆడగొద్దు. వేల కోట్ల ఆస్థి ఉండి కూడా సింపుల్‌గా బతికేవాళ్లన్నారు. ప్రపంచంలోనే టాప్‌ సీఈవోలందరూ 2500 చదరపు అడుగుల ఇంట్లోనే నివసించారు. వాళ్లేప్పుడో జీవితంపై కంప్లైంట్‌ చేయరు. మనకు ఏది అవసరమో, ఏది అనవసరమో కూడా తెలియాలి" అంటున్నారు. ఈ 'సింప్లిసిటీ' మ్యూజింగ్‌ మీకోసం....




Updated Date - 2020-10-25T18:49:37+05:30 IST