డీప్‌గా చూస్తే మనమంతా కాక్‌టెయిల్ బ్యాచ్: పూరీ జగన్నాథ్
ABN , First Publish Date - 2020-10-23T19:48:22+05:30 IST
పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ఇండియా అనే టాపిక్ గురించి ఆయన మాట్లాడుతూ ..

"మన రక్తంలో అరబ్ తెలివితేటలున్నాయి. బ్రిటీష్ తెలివితేటలున్నాయి. చెంగిజ్‌ఖాన్ మూర్ఖత్వం కూడా ఉంది. అందుకనే మనం ఏ దేశంలో అయినా ఈజీగా బతికేస్తాం" అని అంటున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ఇండియా అనే టాపిక్ గురించి ఆయన మాట్లాడుతూ .."ఒకప్పుడు మనదేశం రాజ్యాలుగా, ముక్కలుముక్కలుగా ఉండేది. అంగ, మగధ, కళింగ, అవంతి, కోసం, కురు, పాంచాల ఇలా అన్నీ వేర్వేరు రాజ్యాలుగా ఉండేవి. ఒకరోజు గ్రీకు దేశం నుండి అలెగ్జాండర్ మనమీదకు దండెత్తి కొంత ఆక్రమించాడు. మహ్మద్‌బీన్ ఖాసిం వచ్చి సింధు ప్రాంతాన్ని ఆక్రమించాడు. తర్వాత గజినీ మహమద్, ఘోరీ మహమద్, బాబర్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మంగోలులు ఇలా అందరూ మనల్ని కుమ్మేశారు. తర్వాత వాస్కోడిగామా రావడంతో పోర్చుగీసు వాళ్లు వచ్చారు. మెల్లగా బ్రిటీష్, ఫ్రెంచ్ వాళ్లు వచ్చి సెటిలయ్యారు. అన్నీ దేశాలు బ్రిటీష్ వాళ్ల చేతుల్లోకి వెళ్లాయి. వాళ్లు వెళుతూ వెళుతూ మన చేతిలో ఇండియాను పెట్టారు. అంతకు ముందు ఈ ఇండియా లేదు. వేర్వేరు భాషలు, దేశాలు కలిసున్నాయి. ఇటాలియన్స్ అంటే ఇటాలియన్సే, థాయ్స్ అంటే థాయ్ ప్రజలు మాత్రమే. కానీ ఇండియన్స్‌లో ఒక జాతి, ఒక కులం ఉండదు. పైగా దండయాత్రకు వచ్చినవారందరూ ఇక్కడమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. కొంత మంది బేగమ్స్ అయిపోతే, మరికొందరు మేడమ్స్ అయిపోయారు. ఇలా డీప్‌గా చూస్తే మనమంతా కాక్‌టెయిల్ బ్యాచ్. అందుకు మనకు తెలివితేటలున్నాయి" అని అంటున్న పూరీ మ్యూజింగ్స్ మీకోసం....