నేను కూడా ఓ జంతువునే: పూరీ జగన్నాథ్‌

ABN , First Publish Date - 2020-10-21T17:03:43+05:30 IST

పూరీ మ్యూజింగ్స్‌లో పలు విషయాలపై మాట్లాడుతున్న పూరి.. తాజాగా 'ఫారెస్ట్‌(అడవి)' అనే అంశంపై మాట్లాడారు.

నేను కూడా ఓ జంతువునే:  పూరీ జగన్నాథ్‌

'ఏ జంతువు పగ, ప్రతీకారం, అసూయ, కోపం వంటి వాటిని క్యారీ చేయదు' అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్‌లో పలు విషయాలపై మాట్లాడుతున్న పూరి.. తాజాగా  'ఫారెస్ట్‌(అడవి)' అనే అంశంపై మాట్లాడారు. "నాకే ప్రాబ్లమ్‌ వచ్చినా నేను అడవిలో ఉన్నాను అని అనుకుంటా. నా చుట్టు ఉన్నది జంతువులే. నేను కూడా జంతువునే. ఏదో ఒక జంతువొచ్చి నన్ను చంపాలని చూడొచ్చు, నా చేతిలో ఉన్నదాన్ని పట్టుకుని పారిపోవచ్చు. పోతే పోనియండి ఏం చేద్దాం. ఇది అడివి ఎన్నో జరుగుతుంటాయి. అంతే కానీ ఆ జంతువుపై, దాని పిల్లలపై పగను పెంచుకోను. నాకే జంతువు మీద అసూయ, కోపం ఉండదు. నెక్స్‌ టైమ్‌ జాగ్రత్తగా ఉండటమే. ఎందుకంటే, మన వల్ల కూడా చాలా జంతువులకు డ్యామేజ్‌ జరుగుతుంటుంది. మనం బ్రతికున్నంత కాలం ఎన్నో ప్రాణాలు పోతుంటాయి" అని అంటున్న పూరీ మ్యూజింగ్‌..'ఫారెస్ట్‌' మీకోసం...
Updated Date - 2020-10-21T17:03:43+05:30 IST