నాన్నని గౌరవించండి: పూరీ జగన్నాథ్‌

ABN , First Publish Date - 2020-11-03T00:52:40+05:30 IST

"పెళ్లి తర్వాత పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు" అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌ భాగంగా ఆయన 'డాడీ(నాన్న)' గురించి మాట్లాడుతూ ..

నాన్నని గౌరవించండి:  పూరీ జగన్నాథ్‌

"పెళ్లి తర్వాత పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు" అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌ భాగంగా ఆయన 'డాడీ(నాన్న)' గురించి మాట్లాడుతూ .."నాన్న.. ఎప్పుడూ ఆయన్ని తక్కవగానే చూస్తాం. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. ఎందుకంటే నాన్న ఎవరికీ చెప్పుకోడు. పిల్లలకి, పెళ్లానికి అసలు చెప్పడు. అమ్మలా ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేయడం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు. ఎప్పుడో వెళతాడు. బిజీగా ఉన్న నాన్నయితే రాత్రిపూట ఇంటికొచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని  చూస్తుంటాడు. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడుమనందరి కోసం నాన్న రాత్రి పగలు పనిచేయాలి. చదువు, సమస్యలు, హాస్పిటల్స్‌, బర్త్‌ డే వీటన్నింటితో నాన్న నలిగిపోతాడు. షుగర్‌, యాంగ్జైటీ, పెరాలసిస్‌, హార్ట్‌ ఎటాక్‌ ఇలా ఎన్నో వస్తుంటాయి నాన్నకి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. నిజానికి నాన్నకు వృద్ధాప్యం రాలేదు. మీకోసం అనుక్షణం కరిపోతూ, కాలిపోతున్న నాన్నకి ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలియదు" అని అంటున్న పూరీ మ్యూజింగ్ 'డాడీ' మీకోసం...
Updated Date - 2020-11-03T00:52:40+05:30 IST