యాసిడ్‌ రెయిన్‌ నుండి ఎవడూ కాపాడలేడు: పూరీ జగన్నాథ్‌

ABN , First Publish Date - 2020-10-12T18:26:13+05:30 IST

'రెండు వారాలు యాసిడ్‌ రైన్‌ పడితే చాలు.. ఎవరం మిగలం. ఈ యాసిడ్‌ రైన్‌ నుండి ఎవడూ కాపాడలేడు' అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్. కొన్ని రోజులుగా పలు అంశాలపై పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో వివరిస్తున్న ఆయన తాజాగా 'యాసిడ్‌ రెయిన్‌' అనే అంశంపై మాట్లాడారు.

యాసిడ్‌ రెయిన్‌ నుండి ఎవడూ కాపాడలేడు:  పూరీ జగన్నాథ్‌

'రెండు వారాలు యాసిడ్‌ రైన్‌ పడితే చాలు.. ఎవరం మిగలం. ఈ యాసిడ్‌ రైన్‌ నుండి ఎవడూ కాపాడలేడు' అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్. కొన్ని రోజులుగా పలు అంశాలపై పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో వివరిస్తున్న ఆయన తాజాగా 'యాసిడ్‌ రెయిన్‌' అనే అంశంపై మాట్లాడారు. "నాలుగు వందల కోట్ల సంవత్సరాలకు ముందు వర్షాలు పడి సముద్రాలు తయారయ్యాయి. అనేక జీవాలు పుట్టాయి. హాయిగా ఆడుకుంటున్నాయి. అయితే రెండు వందల మిలియన్‌ సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో రకరకాల గ్యాసులు రిలీజై ఆకాశం నుండి యాసిడ్‌ వాన పడింది. నైట్రిక్‌, సల్ఫూరిక్‌ యాసిడ్స్ కలిసిన వర్షం. ఇది ఆగకుండా రెండు మిలియన్‌ సంవత్సరాలు పడింది. దీంతో సముద్రంలో జలచరాలు చచ్చిపోతాయి. ఆ కాలంలోని డైనోసార్స్‌ సహా అన్నీ జంతువులు చచ్చిపోయాయి. ఇదంతా భూమి ఒకే ఖండంగా ఉన్నప్పుడు జరిగింది. ఆ యాసిడ్‌ వాన తర్వాత సముద్ర జలాలు ఉప్పుగా తయారయ్యాయి. మళ్లీ ఆ సముద్ర నీటికి తగ్గట్లు జలచరాలు పుట్టాయి. తర్వాత మనం పుట్టాం. అలా ఇలా బ్రతుకుతూ కరోనా వరకు వచ్చాం. కొన్ని వందల సంవత్సరాల నుండి మనం బొగ్గును తగలబెడుతున్నాం. వీటి వల్ల మనకు మళ్లీ యాసిడ్‌ రెయిన్‌ పడే అవకాశం ఉంది. ఈ వాన పడితే ముందు పక్షులు, తర్వాత చెట్లు అన్నీ చచ్చిపోతాయి. తర్వాత మనం కూడా చచ్చిపోతాం. ఇప్పుడు వైరస్‌లకంటే, గ్రహ శకలాల ఢీ కొట్టడం కంటే, మూడో ప్రపంచ యుద్ధం కంటే చాలా పెద్ద ప్రమాదం ఏదైనా ఉంటే యాసిడ్‌ రెయిన్‌ మాత్రమే. మనుషులు పెరిగే కొద్దీ కాలుష్యం పెరుగుతుంది" అంటూ యాసిడ్‌ రైన్‌కు గల కారణాన్ని వివరించారు పూరీ జగన్నాథ్. ఆ యాసిడ్‌ రెయిన్‌ ఆడియో మీకోసం...
Updated Date - 2020-10-12T18:26:13+05:30 IST

Read more