కావియర్.. ది రాయల్ ఫిష్!

ABN , First Publish Date - 2020-11-13T22:24:16+05:30 IST

కావియర్ అనే రాయల్ ఫిష్ గురించి తాజాగా వివరించారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌.

కావియర్.. ది రాయల్ ఫిష్!

కావియర్ అనే రాయల్ ఫిష్ గురించి తాజాగా వివరించారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ.. తాజాగా `కావియర్` గురించి మాట్లాడారు. 


`కావియర్‌ని చాలా ఖరీదైన చేప అని చెబుతారు. నిజానికి అది చేప కాదు.. చేప గుడ్లు. ఆ గుడ్లు పెట్టే చేప పేరు స్ట్రజ్జన్. 250 మిలియన్ సంవత్సరాల నుంచి ఈ చేప ఉంది. కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రంలో పెరుగుతుంది. రష్యా, ఇరాన్ ఈ కావియర్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. చైనా, యూరప్ దేశాలు, అమెరికా కూడా ఉత్పత్తి చేస్తుంటాయి. పూర్వం బ్రిటీష్, పర్షియన్ రాజుల కుటుంబాలు మాత్రమే వీటిని తినేవి. వీటిని రాయల్ ఫిష్ అంటారు. అరిస్టాటిల్ కూడా బాగా ఇష్టపడేవాడట. ఇప్పుడు కేవలం ఫైవ్ స్టార్ హోట్సల్‌లో మాత్రమే ఇది దొరుకుతుంది. దీని ఖరీదు చాలా చాలా ఎక్కువ. రోమ్, పారిస్‌లో ఉత్తమ కావియర్ దొరుకుతుంది. అక్కడి రెస్టారెంట్లలో కావియర్‌ను ఎలా తినాలో కూడా చెబుతుంటారు. లండన్‌లో ఈ కావియర్ గుడ్లను 24 కేరట్ల బంగారు బాక్స్‌లలో పెట్టి అమ్ముతారు. ఒక కిలో గుడ్ల విలువ దాదాపు రూ. 7 లక్షలు. అత్యంత ఖరీదైన కావియర్ గుడ్ల ఖరీదు దాదాపు రూ.40 లక్షలు. అంతపెట్టి కొని వీటిని తినాలో, ఏం చేయాలో తెలియదు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. ఇవి అమేజాన్‌లో కూడా ఆర్డర్ ఇవ్వొచ్చు. వీలైతే సరదాగా ప్రయత్నించండ`ని పూరీ పేర్కొన్నారు. Updated Date - 2020-11-13T22:24:16+05:30 IST