ఎక్కువ ఆలోచించకండి: పూరీ జగన్నాథ్

ABN , First Publish Date - 2020-10-08T18:16:49+05:30 IST

ఎక్కువ ఆలోచించకుండా, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్.

ఎక్కువ ఆలోచించకండి: పూరీ జగన్నాథ్

ఎక్కువ ఆలోచించకుండా, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో విషయాల గురించి మాట్లాడిన పూరీ తాజాగా `దేడ్ ధిమాక్` గురించి మాట్లాడారు. 


`మనం ఈ భూమి మీద కొన్ని రోజులు ఉంటాం. ఆ తర్వాత పోతాం. ఈ చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఎక్కువ ఆలోచించొద్దు. ఆ క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే చాలు. మనం కోతులం. కుదురుగా ఉండలేం. అన్నీ కెలికి చూస్తే గాని ఊరుకోం. సమాధానాల కోసం ప్రయత్నించడం మానేస్తే చాలా మంచిది. ఎందుకంటే సమాధానాలు ఎప్పుడూ దొరకవు. దేవుడు ఏంటి, ఆత్మ ఏంటి, ఈ జీవితానికి అర్థం ఏమిటి వంటివి మనకెందుకు? ఓ మంచి పాట పాడగలిగితే, మనస్ఫూర్తిగా నవ్వగలిగితే మీ జీవితం అర్థవంతమైనట్టే. గుర్తుపెట్టుకోండి.. ముగింపు అనేది ఎప్పుడూ దొరకదు. ఈ జీవితాన్ని ఆస్వాదించడానికి జ్ఞానం అక్కర్లేదు. `దేడ్ ధిమాక్` అయితే చాలు. భగవద్గీత మొత్తం చదివితే చివర్లో ఒక విషయం రాశారు.. `అజ్ఞానం ఆనందకరమైనది` అని. అదే `దేడ్ ధిమాక్`. తక్కువ ఆలోచించి ఎక్కువ ఫీలయ్యేవాళ్లే జీవితాన్ని బాగా ఆస్వాదిస్తార`ని పూరీ పేర్కొన్నారు. 



Updated Date - 2020-10-08T18:16:49+05:30 IST