అత్యాచారాల గురించి పూరీ స్పందన..!

ABN , First Publish Date - 2020-10-05T17:32:13+05:30 IST

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ `పూరీ మ్యూజింగ్స్` పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వినిపిస్తున్నారు.

అత్యాచారాల గురించి పూరీ స్పందన..!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ `పూరీ మ్యూజింగ్స్` పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వినిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో విషయాల గురించి మాట్లాడిన పూరీ తాజాగా అత్యాచారాల గురించి మాట్లాడారు. దేశంలో పావుగంటకు ఓ అత్యాచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


`భారత్‌లో ప్రతి పావుగంటకు ఓ అత్యాచారం జరుగుతోంది. రోజుకు వంద అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఈ దేశంలో ఆడవాళ్ల కోసం ఆడవాళ్లే ఫైట్ చేయాల్సి వస్తోంది. మగవాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం సూసైడ్ ఫెస్టివల్స్ జరిగాయి. సుశాంత్ ఒక్కడే కాదు.. ఆ సమయంలో దాదాపు 300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత నెపోటిజం ఫెస్టివల్.. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని చాలా మంది ఫీలైపోతున్నారు. ఇది చాలా అవివేకం. కొత్త హీరోల సినిమాలు బోలెడు విడుదలవుతున్నాయి. వాటిల్లో మీరు ఎన్ని చూశారు. ఎన్ని సినిమాలకు థియేటర్లు నిండాయి. కొత్త హీరోలను ప్రోత్సహిద్దామని మీరు ఎప్పుడైనా టిక్కెట్ కొన్నారా? మీరు స్టార్స్ ఉన్న సినిమాలే చూస్తారు. ఇప్పుడు డ్రగ్ ఫెస్టివల్ జరుగుతోంది. సెలబ్రిటీలు అందరినీ తీసుకెళ్లి ఫేషన్ పెరేడ్ పెట్టారు. ఆడవాళ్ల కోసం నిలబడండి. తెలంగాణలో దిశకు జరిగిన న్యాయం ఈ దేశంలో ప్రతి అమ్మాయికీ జరగాలి. మొన్న ఆగస్ట్ 15న మనందరం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. అదే రోజు ఓ ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆ విషయం మీకెవరికైనా తెలుసా` అని పూరీ పేర్కొన్నారు. 


Updated Date - 2020-10-05T17:32:13+05:30 IST

Read more