వాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్

ABN , First Publish Date - 2020-10-01T14:34:41+05:30 IST

దేశం వదిలి విదేశాలకు వెళ్లిపోతున్న ధనవంతుల సంఖ్య పెరుగుతోందని

వాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్

దేశం వదిలి విదేశాలకు వెళ్లిపోతున్న ధనవంతుల సంఖ్య పెరుగుతోందని, ఒక్క 2015లోనే 4 వేల మంది బిలియనీర్స్ భారత్ నుంచి విదేశాలకు వెళ్లిపోయారని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వెల్లడించారు. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ఆయన తరచుగా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా `వెల్త్ మైగ్రేషన్` గురించి మాట్లాడారు. 


`వరల్డ్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం 2015లో 4 వేల మంది బిలియనీర్స్ దేశం వదిలి వెళ్లిపోయారు. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లిపోయి అక్కడి పౌరసత్వం కూడా తీసుకున్నారు. ఇటీవల ఓ సెలబ్రిటీ కెనడాలో పెట్టుబడులు పెట్టి.. అక్కడి సిటిజన్ షిప్ కోసం కూడా ప్రయత్నించారు. ఇండియాలో పుట్టి.. ఇక్కడ సంపాదించి వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు అని మనం తిట్టుకుంటాం గానీ, ఎందుకలా వెళ్లిపోతున్నారని ఆలోచించం. ఇండియాలో సోమరిపోతుల సంఖ్య పెరిగిపోతోంది. కష్టపడే వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ధనవంతులు, పేదవారి మధ్య అంతరం పెరిగిపోతోంది. పన్నుల వ్యవస్థ కూడా సక్రమంగా లేదు. అందుకే చాలా మంది దేశం వదిలి వెళ్లిపోతున్నారు. ఇకనైనా అందరూ కష్టపడదామ`ని పూరీ పేర్కొన్నారు. 




Updated Date - 2020-10-01T14:34:41+05:30 IST