నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్

ABN , First Publish Date - 2020-09-29T17:25:11+05:30 IST

పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని, తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దకూడదని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్.

నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్

పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని, తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దకూడదని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా `ఇండివిడ్యువాలిటీ` గురించి మాట్లాడారు. 


`మనందరం పిల్లల్ని కని ప్రేమతో పెంచుతాం. వారి ఆరోగ్యం పాడైపోతుందని వర్షంలో తడవనివ్వం, బురదలో ఆడనివ్వం, కాళ్లకు చెప్పులు లేకపోతే ఒప్పుకోం. ఇలా ప్రకృతికి దూరం చేయడం వల్లే వాళ్ల ఇమ్యూనిటీ పోతోంది. దానికి తోడు మన ఇష్టాలన్నీ వాళ్ల మీద రుద్దుతాం. మనకి నచ్చిన డిగ్రీలే వాళ్లు చదవాలి. మనకి నచ్చిన వాళ్లనే వాళ్లు పెళ్లి చేసుకోవాలి. వాళ్లకి ఎందుకీ టార్చర్. పిల్లలకు ఇవ్వాల్సినవి రెండే. ఒకటి అవగాహన, రెండు బలమైన వ్యక్తిత్వం. వాళ్ల నిర్ణయాలను వారు తీసుకోనివ్వండి. ఇక, పిల్లలను అతి గారాబం చేయకండి. పదేళ్లు దాటితే ఎవరూ పిల్లలు కాదు. నేను పదేళ్లకే ఓ పిల్లకు ప్రేమలేఖ రాశా. ఇంకా చిన్న పిల్లలేంటి. పదేళ్లు దాటిన పిల్లలను పెద్ద వాళ్లుగానే పరిగణించండి. వారి అభిప్రాయాలను గౌరవించండ`ని పూరీ పేర్కొన్నారు. 
Updated Date - 2020-09-29T17:25:11+05:30 IST