ఆస్ట్రేలియాకు మతి పోగొట్టిన ముసలాడు గ్రేట్‌: పూరీ జగన్నాథ్‌

ABN , First Publish Date - 2020-11-04T02:03:28+05:30 IST

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ కొన్నిరోజులుగా పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో పలు విషయాలపై మాట్లాడుతున్నాడు. తాజాగా ఆయన 'హట్‌ రివర్‌' గురించి మాట్లాడుతూ

ఆస్ట్రేలియాకు మతి పోగొట్టిన ముసలాడు గ్రేట్‌:  పూరీ జగన్నాథ్‌

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ కొన్నిరోజులుగా పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో పలు విషయాలపై మాట్లాడుతున్నాడు. తాజాగా ఆయన 'హట్‌ రివర్‌'  గురించి మాట్లాడుతూ "ఆస్ట్రేలియాలోఓ రైతు ఉండేవాడు. అతని పేరు లియోనార్డ్‌ కాస్‌లే. తన కుటుంబ సభ్యులతో కలిసి అందులో వ్యవసాయం చేసుకునేవాడు. అయితే ఓసారి పరిస్థితులు బాగోలేక, పంటలు పండక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. అతని కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో వాడికి కోపం వచ్చింది. అసలు ఆస్ట్రేలియా నా దేశమే కాదు. నేను నా పొలమే ఓ దేశం. నా పిల్లలే నా సైన్యం. నేనే దానికి రాజుని. తనకునన 75 చదరపు కిలోమీటర్ల భూమిని ఓ మైక్రో దేశం ప్రకటించాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి లెటర్‌ పంపాడు. అందరూ నవ్వేశారు. అందరికీ అతను కమెడియన్‌ నవ్వాడు. అయితే 1970లో ఆ ప్రాంతానికి హట్‌ రివర్‌ అని పేరు పెట్టి స్వతంత్ర్యాన్ని ప్రకటించేసుకున్నాడు. ఓ పతాకం తయారు చేశాడు. కొత్త కరెన్సీ డిజైన్‌ చేశాడు. ఓ దేశం ఏర్పాడాలంటే కొన్ని రూల్స్‌ పాటించాలి. అవన్నీ తనకున్నాయంటూ అన్నీ దేశాలకు లెటర్స్‌ పంపాడు. ఎవరూ పట్టించుకోలేదు. 



చివరకు వాడు క్వీన్‌ ఎలిజిబెత్‌కు 'మేడమ్‌.. నేను మీ అభిమానిని. హట్‌ రివర్‌ అనే దేశం మీది. నాకేం జరిగినా, మీరే చూసుకోవాలి' అని లెటర్‌ రాశాడు. క్వీన్‌ఎలిజిబెత్ అతని లెటర్‌ను ఒప్పుకుంటూ అతని తన సపోర్ట్‌ తెలియజేస్తూ స్టాంప్‌ వేసి ఓ లెటర్‌ పంపింది. దాంతో ఆస్ట్రేలియాకు మతిపోయింది. ఇప్పుడు వాడినేమైనా చేస్తే క్వీన్‌ ఎలిజిబెత్ సీరియస్‌గా తీసుకుంటుందేమోనని భయపడింది. ఎందుకంటే మనలాగే ఆస్ట్రేలియా కూడా బ్రిటీష్‌ వారిపాలనలో ఉండింది. ఎందుకొచ్చిన గొడవ అని ఆరోజు నుండి ప్రభుత్వం ఆ రైతుని వదిలేసింది. ఆరోజు నుండి నిజంగానే అది ఒక దేశం అయ్యింది. క్రమంగా టూరిస్టుల రాకపెరిగింది. టూరిస్టులు వచ్చి రాజు, రాణితో కలిసి భోజనం చేసేవారు. ఆ కింగ్‌ 95 ఏళ్ల వయసులో ఈమధ్యనే చనిపోయాడు. ఈ కోవిడ్‌ కారణంగా వారికి టూరిజం లేదు. డబ్బులు లేవు. ఫ్యామిలీ కష్టాల్లో పడింది. క్వీన్‌ ఎలిజిబెత్‌ కూడా 95 ఏళ్ల వచ్చాయి. ఆమెకు ఆన్నీ గుర్తుండటం లేదు. దీన్ని అదనుగా తీసుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ ఫ్యామిలీ మీద కేసు పెట్టింది. మీరు యాబై ఏళ్లుగా ఎలాంటి ట్యాక్సులు కట్టడం లేదని ఒత్తిడి తెచ్చింది.  ఇప్పుడు లియోనార్డో పిల్లలకు కూడా అరవై ఏళ్లు దాటేశాయి. వయసు అయిపోవడంతో వారు పోరాడలేక. వాళ్లు భూమిని అమ్మకానికి పెట్టారు. అప్పులు తీర్చి తర్వాత దాన్ని ఆస్ట్రేలియాలో కలిపిస్తారు. ఏదేమైనా ఆ ముసలాడు గ్రేట్‌. తనకంటూ ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకుని యాబై ఏళ్లు ఓ కింగ్‌లాగా బతికాడు" అంటున్న పూరీ మ్యూజింగ్‌ ''హట్‌ రివర్‌' మీకోసం...




Updated Date - 2020-11-04T02:03:28+05:30 IST