మన లైఫ్‌లో బెస్ట్ ఇయర్ 2020నే: పూరి
ABN , First Publish Date - 2021-01-01T03:11:08+05:30 IST
2020 సంవత్సరమే చాలా ఉత్తమమైన సంవత్సరంగా పరిగణిస్తున్నారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో '2020 పూరి మ్యూజింగ్స్' అని.. 2020 సంవత్సరం
2020 సంవత్సరమే చాలా ఉత్తమమైన సంవత్సరంగా పరిగణిస్తున్నారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో '2020 పూరి మ్యూజింగ్స్' అని.. 2020 సంవత్సరం యొక్క గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు. మరి ఎందుకు 2020 బెస్ట్ ఇయర్ అని పూరీ అన్నారో తెలుసుకుందామా..
''అందరూ 2020ని తిట్టుకుంటున్నారు. కానీ మన లైఫ్‌లో బెస్ట్ ఇయర్ మాత్రం 2020యే. ఈ 2020 మనకి చాలా నేర్పింది. హెల్త్ ఎంత ఇంపార్టెంటో అందరికీ అర్థమైంది. ఇమ్యూనిటీ ఎంత అవసరమో తెలిసింది. మంచి ఆహారం యొక్క విలువ తెలిసింది. శుభ్రత నేర్చుకున్నాం. పుట్టిన తర్వాత ఇన్ని సార్లు ఎప్పుడూ మనం హ్యాండ్ వాష్ చేసుకోలేదు. పల్లెటూళ్లలో చదువుకోని వారికి కూడా చాలా విషయాలు తెలిశాయి. వైరస్, న్యూట్రేషన్, శానిటైజర్, క్వారంటైన్, యాంటీ బాడీస్, ప్లాస్మా, స్ట్రెయిన్ ఇలా ఎన్నో విషయాలు తెలిసిపోయాయ్. మొదట్లో నెలరోజులు లాక్‌డౌన్ అంటే మనకి పిచ్చి లేచింది. ఖాళీగా ఇంటిలో కూర్చోవాలంటే.. మెంటల్ హెల్త్ చాలా అవసరం అని తెలుసుకున్నాం. మనలో ఓర్పు బాగా పెరిగింది. ఆత్మనిర్భార్.. ఆ తర్వాత మెల్లగా కామ్ అయ్యాం. అన్నీ పక్కనపెట్టి కామ్‌గా కూర్చున్నాం. 8 నెలలు ఎలా గడిచిపోయాయో మనకే తెలియదు. డబ్బు ఉన్నా, లేకపోయినా.. ఎలా బతికామో.. మనకే తెలియదు. నిజమైన స్నేహితులెవరో ఇప్పుడే తెలిసింది. లైఫ్‌లో సేవింగ్స్ ఎంత అవసరమో తెలిసివచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకున్నాం. ఆడవాళ్లు.. బంగారం, కొత్తచీరలు లేకుండా బతకడం నేర్చుకున్నారు. అవసరమైనవి మాత్రమే కొంటున్నాం. అనవసరమైన షాపింగ్‌లు, చిరుతిళ్లు తగ్గాయ్. నేచర్ చాలా పవర్‌ఫుల్ అని తెలిసింది. ఏ దేవుడూ మనల్ని కాపాడలేడని తెలిసింది..'' అంటూ 2020 యొక్క గొప్పతనాన్ని పూరీ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూడాల్సిందే.