అందాన్ని కొలిచే సాధనం ఉంది తెలుసా?: పూరి

ABN , First Publish Date - 2020-10-12T03:43:56+05:30 IST

అందం అంటే ఏమిటి? ఏది అందంగా ఉందో ఎలా తెలుసుకోవాలి? అందాన్ని కొలవడానికి ఏదైనా పద్ధతి ఉందా?.. అనే విషయాలు

అందాన్ని కొలిచే సాధనం ఉంది తెలుసా?: పూరి

అందం అంటే ఏమిటి? ఏది అందంగా ఉందో ఎలా తెలుసుకోవాలి? అందాన్ని కొలవడానికి ఏదైనా పద్ధతి ఉందా?.. అనే విషయాలు తెలుసుకోవాలంటే.. పూరీ మ్యూజింగ్స్‌లో పూరి చెప్పిన ఈ గోల్డెన్‌ రేషియో వినాల్సిందే. డ్యాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌.. తన పూరీ మ్యూజింగ్స్‌లో అందాన్ని కొలిచే సాధనం గురించి చెప్పుకొచ్చారు. అదేమిటో.. అది ఎలా అందాన్ని కొలుస్తుందో.. వంటి వివరాలను ఆయన తెలిపారు. మరెందుకు ఆలస్యం.. అదేంటో తెలుసుకుందామా...


''అందం అంటే ఏమిటి? ఏది అందంగా ఉందో ఎలా తెలుసుకోవాలి? అందాన్ని కొలవడానికి ఏదైనా పద్ధతి ఉందా? అంటే ఉంది. 500 బి.సి.లో ఫిడియస్‌ అనే ఒక గ్రీక్స్‌ కల్చర్‌ అండ్‌ మ్యాథ్‌ మేటిషియన్‌ అందానికి ఒక లెక్క తయారు చేశాడు. అదే గోల్డెన్‌ రేషియో. 1: 1.6 రేషియో. మీ ముఖం తాలుకూ లెంత్‌ను, మీ ముఖం యొక్క విడ్త్‌తో డివైడ్‌ చేస్తే అది విడ్త్‌ కన్నా 1.6 ఎక్కువ ఉంది. అలా ఉంటే చూడడానికి బాగుంటుంది. ముఖమే కాదు కళ్ళు, పెదాలు, చెవులు.. ఇలా మనిషిలోని ప్రతి పార్ట్‌ని కొలవవచ్చు. ఫిడియస్‌ ఈ పద్ధతి వాడి తన ప్రతి స్కల్చర్‌ చెక్కేవాడు. అందుకే ఆయన చెక్కిన శిల్పాలన్నీ చూడడానికి చాలా అందంగా ఉండేవి. అప్పటి నుంచి అందరూ దీనిని వాడటం మొదలు పెట్టారు. అందుకే రొమాన్‌ శిల్పాలన్నీ అంత అందంగా ఉంటాయ్‌. మనుషులే కాదు మన కంటికి కనిపించే ప్రతీది నచ్చిందీ అంటే.. అది గోల్డెన్‌ రేషియోలో ఉన్నట్లే. పువ్వులు, ఆకులు, వస్తువులు, నేచర్‌.. ఈ క్రియేషన్‌లో అందంగా కనిపించే ప్రతీది గోల్డెన్‌ రేషియోలోకే వస్తాయి. అసలు ఈ రేషియో ప్రకారం మీరు అందంగా ఉన్నారా? లేదా? తెలుసుకోవడానికి గోల్డెన్‌ రేషియో అని కొడితే కొన్ని యాప్స్ వస్తాయ్‌. మీరు సెలక్ట్ చేసుకుంటే అదే అన్నీ కొలిచేస్తది. మీ కళ్ళు, ముక్కు అన్నీ కరెక్ట్గ్‌గా ఉన్నాయో, లేదో చెబుతుంది. మీరు అందంగా ఉండేందుకు ఏం చేయాలో సలహా కూడా ఇస్తది. లేదంటే ఆన్‌ లైన్‌లో గోల్డెన్‌ రేషియో క్యాలుక్యులేటర్‌ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.. వరల్డ్స్‌ బెస్ట్ ఫేస్‌ మనదే.. ఇంకేం కావాలి.. '' అంటూ పూరీ ఈ గోల్డెన్‌ రేషియో గురించి చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఈ గోల్డెన్‌ రేషియో గురించి ఏం చెప్పారో.. తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.

Updated Date - 2020-10-12T03:43:56+05:30 IST

Read more