చిరు, వెంకీలను మిస్సయిన డ్యాషింగ్ డైరెక్టర్

ABN , First Publish Date - 2020-04-20T03:59:50+05:30 IST

హిట్లు, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా క్రేజ్‌ను కంటిన్యూ చేస్తున్న దర్శకుడెవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పూరీ జగన్నాధే. ఎందుకంటే వరుస ప్లాప్స్‌తో ఉన్నప్పుడు

చిరు, వెంకీలను మిస్సయిన డ్యాషింగ్ డైరెక్టర్

హిట్లు, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా క్రేజ్‌ను కంటిన్యూ చేస్తున్న దర్శకుడెవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పూరీ జగన్నాధే. ఎందుకంటే వరుస ప్లాప్స్‌తో ఉన్నప్పుడు కూడా పూరీ ఫాలోయింగ్‌‌లో తేడా కనబడలేదు. ఎందుకంటే ఆయన చూపించే హీరోయిజం అలా ఉంటుంది. ఏ హీరో అభిమాని అయినా సరే.. పూరీతో మా హీరో మరొక్కసారి చేస్తే బాగుండు అనేలా హీరోలను పూరీ చూపిస్తాడు. మూవీ రిజల్ట్‌తో కూడా సంబంధం లేదు.. అంతగా పూరీ ఫోకస్ హీరోపై ఉంటుంది. అయితే దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పూరీ.. దాదాపు టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు. కానీ ఇద్దరు హీరోలను మాత్రం ఇప్పటి వరకు డైరెక్ట్ చేయలేకపోయాడు. ఆ హీరోలు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్. 


పవన్ కల్యాణ్‌తో తన తొలి చిత్రం మొదలెట్టిన పూరి.. బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ, గోపీచంద్, వరుణ్ తేజ్, రానా, కల్యాణ్ రామ్ వంటి హీరోలందరినీ డైరెక్ట్ చేశాడు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ని కూడా పూరీ డైరెక్ట్ చేశాడు. కానీ చిరంజీవి, వెంకటేష్‌లతో మాత్రం ఆయన ఇంత వరకు సినిమా చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ అవకాశం పూరీకి వచ్చినట్టే వచ్చి చేజారింది. అయితే త్వరలోనే మెగాస్టార్‌తో సినిమా చేస్తానని, ఆయన్ని డైరెక్ట్ చేయడం తన డ్రీమ్ అని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పిన పూరీ, వెంకటేష్‌తో కూడా ఓ మూవీ చేయాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. 

Updated Date - 2020-04-20T03:59:50+05:30 IST