పెళ్లి కాదు.. ఫ్యాన్స్‌ని బురిడీ కొట్టించిన పునర్నవి

ABN , First Publish Date - 2020-10-30T23:44:29+05:30 IST

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంతకాలం వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని, బయటికి వచ్చాక వారిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అనేలా పునర్నవి

పెళ్లి కాదు.. ఫ్యాన్స్‌ని బురిడీ కొట్టించిన పునర్నవి

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంతకాలం వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని, బయటికి వచ్చాక వారిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అనేలా పునర్నవి, రాహుల్‌ సిప్లిగంజ్‌ విషయంలో వార్తలు వచ్చాయి. వారిద్దరూ లవ్‌లో ఉన్నారని, త్వరలోనే వారి పెళ్లి అనేలా కూడా వార్తలు వచ్చాయి. మధ్యలో రాహుల్‌ మాట్లాడుతూ.. పునర్నవి వేరే వారితో ప్రేమలో ఉందని చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌ వేదికగా నిశ్చితార్థపు ఉంగరం చూపించి.. పునర్నవి హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ అనే నటుడిని ఆమె పెళ్లి చేసుకోబోతోందనే అర్థం వచ్చేలా తర్వాత ఆమె చేసిన మరో పోస్ట్ వైరల్‌ అయ్యింది. అలాగే మరోవైపు ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ కూడా పునర్నవితో కలిసి ఉన్న ఫొటోని పోస్ట్ చేసి.. ఫైనల్‌గా ఆమె ఓకే చెప్పింది అంటూ.. ఇంక పెళ్లే అనేలా పోస్ట్‌లు చేశాడు. వీరిద్దరూ ఇంతగా చెబుతున్నా.. నెటిజన్లు మాత్రం.. ఇదేదో తేడా కొడుతుందని అనుకుంటూనే ఉన్నారు. 


అనుకున్నట్లుగానే అభిమానులను వీరిద్దరూ బురిడీ కొట్టించారు. పెళ్లి కాదు.. ప్రమోషన్‌ కోసమే వీరిద్దరూ ఇంత హడావుడి చేశారనేది తాజాగా వారు చేసిన పోస్ట్‌లు చూస్తే అర్థమవుతుంది. వారిద్దరూ కలిసి నటిస్తున్న 'కమిట్‌ మెంటల్‌' అనే వెబ్‌ సిరీస్‌ కోసం.. పునర్నవి, ఉద్భవ్‌ ఇలా పెళ్లి డ్రామాలు ఆడారు. అయితే అంతకుముందు సాయితేజ్‌ కూడా ఇటువంటి ప్రయోగమే.. చేయడంతో.. ఇప్పుడు వీరిద్దరూ చేసిన ఈ హడావుడి పులిహోర అయిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తుండటం విశేషం. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ని పవన్‌ సాధినేని డైరెక్ట్ చేస్తున్నారు.

Updated Date - 2020-10-30T23:44:29+05:30 IST