పబ్లిసిటీ డిజైనర్‌ ఉదయ భాస్కరరావు కన్నుమూత

ABN , First Publish Date - 2020-06-12T06:20:59+05:30 IST

సినీ పబ్లిసిటీ డిజైనర్‌ ఉదయ భాస్కరరావు ఇటీవల గుండెపోటుతో మరణించారు. పాలకొల్లులో జన్మించిన ఆయన చెన్నైలో స్థిరపడ్డారు...

పబ్లిసిటీ డిజైనర్‌ ఉదయ భాస్కరరావు కన్నుమూత

సినీ పబ్లిసిటీ డిజైనర్‌ ఉదయ భాస్కరరావు ఇటీవల గుండెపోటుతో మరణించారు. పాలకొల్లులో జన్మించిన ఆయన చెన్నైలో స్థిరపడ్డారు. పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ దగ్గర పదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత స్వతంత్రంగా లియో, లహరి, సూర్య, టిప్స్‌ ఆడియో కంపెనీలకు పబ్లిసిటీ డిజైనర్‌గా కొనసాగారు. ఆయనకు భార్య అన్నపూర్ణ, కుమారుడు సుధీర్‌, కుమార్తె స్రవంతి ఉన్నారు.


Updated Date - 2020-06-12T06:20:59+05:30 IST