నాగశౌర్య సినిమా ఆగిపోలేందంటున్న నిర్మాత‌లు

ABN , First Publish Date - 2020-02-26T21:33:18+05:30 IST

ఈ ఏడాది ‘అశ్వ‌థ్థామ’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యువ కథానాయకుడు నాగశౌర్యకి నిరాశే మిగిలింది.

నాగశౌర్య సినిమా ఆగిపోలేందంటున్న నిర్మాత‌లు

ఈ ఏడాది ‘అశ్వ‌థ్థామ’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యువ కథానాయకుడు నాగశౌర్యకి నిరాశే మిగిలింది. అయితే లేటెస్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో నాగశౌర్య హీరోగా చేస్తోన్న సినిమా ఆగిపోయిందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్ క్లారిటీ ఇచ్చింది. ‘‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ సినిమా ఆగిపోయిందంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. మిగిలిన భాగాన్ని అమెరికాలో చిత్రీక‌రించాల్సి ఉంది. వీసాల కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమా బాగా వ‌చ్చింది’’ అన్నారు. 


Updated Date - 2020-02-26T21:33:18+05:30 IST